లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్

అసలే ఎండాకాలం.. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు.. కార్లు, బైకులు, ఇతర వాహనాలు నిప్పంటుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. అధిక వేడికి ఆగి వున్న వాహనాలు, కదిలే వాహనాలు కూడా మంటలు వ్యాపించే అనేక వీడియోలు ఇంటర్నెట్ లో కనిపిస్తున్నాయి. అయితే తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. 

భువనగిరి పట్టణ శివారు ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో ట్రక్కు డీజిల్ ట్యాంక్ లో చెలరేగిన మంటలు చెలరేగాయి. అయితే బంక్ లో పనిచేసే ఉద్యోగి ధైర్యంగా చాకచాక్యంగా మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి శివారులోని నయారా పెట్రోల్‌ బంకులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఘటనా స్థలంలో ఇతర వాహనాలు కూడా ఉన్నాయి. ఇంధనం నింపుకోవడానికి మరో ట్రక్కు పెట్రోల్ పంపు వద్ద ఉంచబడింది. పెట్రోల్ పంప్ ఉద్యోగులు కూడా స్టేషన్‌లో ఉన్నారు. ఒక్కసారిగా ట్రక్కు డీజిల్ ట్యాంక్ పేలడంతో ప్రజలంతా ప్రాణాలతో పరుగులు తీశారు. ఒక ఉద్యోగి ధైర్యంగా మంటలను ఆర్పేందుకు పరుగెత్తాడు. మంటలను ఆర్పే యంత్రాన్ని తీసుకొని ధైర్యంగా మంటలను ఆర్పడం ప్రారంభించాడు. 

ఆ వ్యక్తి మంటలను ఆర్పే యంత్రాన్ని పిచికారీ చేయడం..సిలిండర్ ఖాళీ కావడంతో మంటలు మళ్లీ చెలరేగడం వీడియోలో చూడవచ్చు. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆర్పివేయడానికి మరో సిలిండర్ తీసుకుని మంటలను ఆర్పే ప్రయత్నాన్ని పునఃప్రారంభించాడు. అతన్ని చూసి ఇతరులు కూడా ముందుకు వచ్చి అతనికి సాయం చేశారు. కొంతసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాహసోపేతమైన పెట్రోల్ పంప్ ఉద్యోగి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు. 

ఉద్యోగి ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్నారు ఒక నెటిజన్.. ఇలాంటి అంకిత భావంతో పనిచేసే మనుషులు ప్రతి ఒక్కరికి ఇన్పిరేషన్ అని మరో నెటిజన్.. ఉద్యోగిని నయారా పెట్రోల్ పంప్ యాజమన్యం, ప్రభుత్వం అతని ధైర్య సాహసాలను గుర్తించాలని ఇంకో నెటిజన్.. ఆ ఉద్యోగి స్పందించకపోయి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది అని మరో నెటిజన్.. ఇలా పొగడ్తల జల్లు కురిపించారు. 

అయితే ఇంకో సలహా కూడా ఇచ్చారు నెటిజన్లు..ఫ్యాక్టరీలు, షాపులు, పని ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మంటలను ఆర్పే యంత్రాలు తప్పనిసరిగా ఉండా.. వాటి  వినియోగంపై అవగాహన చాలా అవసరం అని నెటిజన్లు సలహాలు ఇచ్చారు. 

ఏదీ ఏమైనా పెట్రోల్ పంప్ ఉద్యోగి సాహసంతో పెద్ద ప్రమాదం తప్పిందని అటు పెట్రోల్ యాజమాన్యం, ఇటు వాహనాదారులు, అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఉద్యోగిని అభినందించారు.