Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌' వినేది ఎప్పుడంటే?

Indian 2 Update: భారతీయుడు 2 ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..'కమ్‌ బ్యాక్‌ ఇండియన్‌' వినేది ఎప్పుడంటే?

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. 28 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా వస్తోన్న భారతీయుడు 2 (Indian 2) మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా శంకర్  తెరకెక్కిస్తున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఇండియన్ 2 నుండి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. "నమస్తే ఇండియా!రాక్‌స్టార్ అనిరుధ్ సంగీత సారథ్యంలో  ఇండియన్-2 నుండి ఫస్ట్ సింగిల్ మే 22న విడుదల కానుంది!సేనాపతి పునరాగమనాన్ని స్వాగతించడానికి ఇండియా అంతటా సిద్ధంగా ఉండండి!అంటూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఇక భారతీయుడు 2 నుంచి మోగబోయే పాటల నగరాలో ఎలాంటి ప్రశ్నలు రేకిత్తిస్తారో అనే ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంది.అందుకు ఈ ఫస్ట్ సింగిల్ నిదర్శనంగా నిలిచే ఛాన్స్ ఉంది. 

ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేసిన ఇంట్రో గ్లింప్స్‌ (AN INTRO) సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.పెంచడమే కాదు..కమల్‌హాసన్‌ వాడే ఆయుధం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ మూవీ 12 జూలై 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 

త్వరలో చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో భారతీయుడు 2 ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై మేకర్స్ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

  • Beta
Beta feature