Adah sharma Bastar OTT: బస్తర్ ది నక్సల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

Adah sharma Bastar OTT: బస్తర్ ది నక్సల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడంటే?

పలు చిత్రాల్లో  హీరోయిన్‌‌గా గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకున్న అదా శర్మ (Adah sharma). ప్రస్తుతం లీడ్ రోల్స్‌‌లో వరుస సినిమాలు చేస్తోంది. రీసెంట్‌‌గా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఆ వెంటనే కేరళ స్టోరీ టీమ్‌‌తో మరో ప్రాజెక్టుగా  బస్తర్ (Bastar)  సినిమా తీసి సంచలనంగా మారింది.

డైరెక్టర్ సుదీప్తో సేన్ ఎంతో రీసెర్చ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 15న  థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.దీంతో ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. ఈ మేరకు ప్రముఖ తెలుగు జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ మే 17న స్ట్రీమింగ్‍ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ మే 17న నుంచి స్ట్రీమింగ్ కానుంది.

దట్టమైన అడవుల్లో నక్సల్స్ సృష్టిస్తున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి వచ్చిన ఐపీఎస్ అధికారి పాత్రలో అదా శర్మ కనిపించి ఆకట్టుకుంది. కానీ, ఈ సినిమా వివాదాస్పదమైంది.బస్తర్ జిల్లాలో నక్సల్స్కి,ఇండియన్ ఆర్మీకి మధ్య పరస్పరం కాల్పులు జరుగడం..రెడ్ కారిడార్లో భాగమైన ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం వంటి సీన్స్ ఆసక్తికరంగా సాగాయి.

అలాగే,పాకిస్థాన్ తో జరిగిన నాలుగు యుద్ధాల్లో చనిపోయిన మన భారత సైనికుల కంటే ఈ మావోయిస్టులు చంపిన సైనికుల సంఖ్యే రెట్టింపుగా ఉందనే..డైలాగ్స్ ఎన్నో ఆలోచింపజేసేలా ఉన్నాయి.

“సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, భీకర ఫైటర్ ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ).. నక్సలిజాన్ని అరికట్టేందుకు వస్తున్నారు. మే 17న బస్తర్ జీ5లో హిందీ, తెలుగులో ప్రీమియర్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది.మరి ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆదరిస్తుందో చూడాలి.  

కథేంటంటే?

చత్తీస్‍గఢ్‍ రాష్ట్రం సుక్మాలో 2010లో నక్సలైట్ల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన ఘటన ఆధారంగా ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చిత్రం తెరకెక్కింది. ఆ ప్రాంతంలో నక్సలైట్లను నిలువరించేందుకు ఐపీఎస్ నీరజా మాధవన్ (అదా శర్మ)ను ప్రభుత్వం రంగంలోకి దించుకుంది. మరోవైపు నీరజ నకిలీ ఎన్‍కౌంటర్లు చేశారని కోర్టులో వాదిస్తుంటారు లాయర్ నీలమ్ నాగ్‍పాల్ (శిల్పా శుక్లా). మరోవైపు నక్సలైట్లు తమ కార్యకలాపాలను జోరుగా చేస్తుంటారు. మరి నక్సలైట్లను ఐపీఎస్ నీరజ నిలువరించిందా లేదా అనేది చూసి తెలుసుకోవాల్సిందే.