పోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ.. 

పోస్టల్ బ్యాలెట్ కు గడువు పెంచిన ఈసీ.. 

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్ తేదికి మరో 5రోజులు మాత్రమే సమయం ఉండగా పోస్టల్ బ్యాలెట్ సందడి నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కి గడువు పెంచుతూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ ( 8వ తేదీ ) ముగియాల్సిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కి మరొక రోజు పెంచింది ఈసీ. దీంతో ఉద్యోగులు 9వ తేదీ (గురువారం ) వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు అధికార ప్రతిపక్షాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ సెంటర్ల వద్ద ఉద్యోగులకు నగదు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సెంటర్ల వద్ద ఈసీ గట్టి నిఘా పెట్టడంతో నేతలు ప్రత్యామ్నాయ పద్ధతులు వెతుకుతున్నారు. కొంతమంది ఉద్యోగులకు యూపీఐ,బ్యాంకు అకౌంట్ ద్వారా నగదు పంపినట్లు ఈసీ గుర్తించింది. నగదు పంపిణీ చేసిన అభ్యర్థులకు, తీసుకున్న ఉద్యోగులపై కూడా చర్యలు తప్పవని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.