ఖమేనీ మృతిపై ఇరాన్ లో వేడుకలు

ఖమేనీ మృతిపై ఇరాన్ లో వేడుకలు

దుబాయ్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతిపై ఆ దేశంలో కొంతమంది పౌరులు సంబరాలు చేసుకున్నారు. పలు నగరాల్లో ర్యాలీలు తీస్తూ హర్షం వ్యక్తం చేశారు. దక్షిణ ఇరాన్​లోని గాల్లేహ్ దార్  పట్టణంలో ఒక స్మారకాన్ని కూల్చివేశారు. ‘‘ఇది కలా? నిజమా? ఖమేనీ చనిపోయాడా? అది నిజమైతే ఇరాన్​లో కొత్త అధ్యాయం మొదలైనట్లే. కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నాం” అంటూ కొంతమంది పౌరులు వ్యాఖ్యలు చేశారు. 

అలాగే కరాజ్, ఇజేహ్ నగరాల్లో స్థానికులు వీధుల్లోకి వచ్చి ఖమేనీ మృతిని సెలబ్రేట్  చేసుకున్నారు. డ్యాన్సులు చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా పోలీసులు వేలాది మందిని కాల్చి చంపారు. 

మరణించిన వారిలో పోయా జఫారీ(15) కూడా ఒకరు.. ఈ క్రమంలోనే ఖమేనీ మరణించారనే వార్త తెలిసి జఫారీ ఇంటి ముందు జనం సంబరాలు జరుపుకున్నారు. 1979లో ఇస్లామిక్  రెవల్యూషన్ తర్వాత అంతటి హింసాత్మక పరిస్థితి నెలకొనడం అదే తొలిసారి.