జగన్ యోగి రాజు, నవ్య చిట్యాల జంటగా రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం పూజాకార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్‌తో పాటు సన్నిహితులు హాజరై బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీ హన్సిక మాట్లాడుతూ ‘హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తొలి చిత్రాన్ని అత్యంత ప్రెస్టేజీయస్‌గా నిర్మిస్తున్నాం.
ఇదొక అందమైన యూత్‌ఫుల్ లవ్ డ్రామా. లవ్, ఎమోషన్స్, కామెడీ కలయికలో ప్రేక్షకులను అలరించేలా ఈ కథను ఎంపిక చేసుకున్నాం. యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉండబోతోంది’ అని చెప్పారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు దర్శకుడు రఘువర్ధన్ కోట్ల అన్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. నటులు దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి తవిటిరాజు తలచింతల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజీవ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు.
