మూడు హృదయాల కల.. ‘ఏమో ఏమో ఇది’ సినిమాపై శైలేష్ కొలను

మూడు హృదయాల కల.. ‘ఏమో ఏమో ఇది’ సినిమాపై శైలేష్ కొలను

రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న చిత్రం ‘ఏమో ఏమో ఇది’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయగా, తాజాగా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. ‘హిట్’ ఫ్రాంచైజీతో మాస్ మూవీస్‌‌‌‌ను రూపొందించిన శైలేష్ ఈసారి ఓ రొమాంటిక్ లవ్‌‌‌‌స్టోరీను తెరకెక్కిస్తున్నాడు. 

‘మూడు హృదయాలు.. ఒకే కల.. ఇదొక అందమైన ప్రారంభం. కొంతకాలంగా మేము నిశ్శబ్దంగా నమ్ముతున్న ఒక బలమైన అనుభూతిని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం’ అని ఈ సందర్భంగా దర్శకుడు శైలేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని  దసరాకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.