కూతురిని వేధిస్తున్న యువకుడిని కొట్టి చంపిన కుటుంబసభ్యులు

కూతురిని వేధిస్తున్న యువకుడిని కొట్టి చంపిన కుటుంబసభ్యులు

ప్రేమ పేరుతో కూతురిని వేధిస్తున్న ఓ యువకుడిన చితకొట్టారు ఆమె కుటుంబ సభ్యులు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో జరిగింది. సుర్జాపూర్ గ్రామానికి చెందిన అనిల్..అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ  వేధించడం మొదలు పెట్టాడు. రెండేళ్లుగా వెంటపడి వేధిస్తుండటంతో..మనస్థాపం చెందిన ఆ యువతి.. తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ..అనిల్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయినా అతనిలో మార్పు రాకపోగా..యువతి ఇంటి చుట్టూ తిరుగుతుండగంతో గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు అనిల్ ను  కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు నిర్మల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు.

అనిల్ చనిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మృతికి కారకులైన వారి ఇంటికి డెడ్ బాడీతో వెళ్లేందుకు ప్రయత్నించారు అతని కుటుంబ సభ్యులు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.