ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో మహిళ మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫెయిలై ఓ మహిళ చనిపోయింది. ఈ నెల 25న ప్రభుత్వ హాస్పిటల్ లో నిర్వహించిన కుటుంబ నియంత్రణ శిబిరంలో 27 మందికి ఆపరేషన్లు చేశారు. వీళ్ళల్లో నలుగురికి ఆపరేషన్ వికటించడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా... మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

మృతురాలు మాడుగుల మండలం నర్సయిపల్లికి చెందిన మమతగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. మహిళ మృతికి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని బంధువులు మండిపడుతున్నారు. మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.