ఈ రోజుల్లో సోషల్ మీడియాలో గ్రీక్ యోగర్ట్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. ఇది విదేశీయులకు బాగా అలవాటైన ఆహారం. అయితే మన భారతీయుల జీర్ణవ్యవస్థకు, మన వాతావరణానికి మన ఇంట్లో దొరికే పెరుగు, ఇడ్లీ, దోస వంటి ఆహారాలే ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పెరుగు వర్సెస్ గ్రీక్ యోగర్ట్
గ్రీక్ యోగర్ట్ తయారీలో నీటిని పూర్తిగా వడకట్టేస్తారు. దీనివల్ల అది చిక్కగా ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల దానిలో ఉండే కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గే అవకాశం ఉంది.
మన ఇంట్లో తోడుపెట్టుకునే పెరుగులో మన శరీరానికి, మన వాతావరణానికి తగిన మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడంలో చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది.
ALSO READ : కెరీర్ స్టార్టింగ్లో నాకు ఇట్లనే అయింది..
ఇడ్లీ, దోసలు ఎందుకు బెస్ట్
మనం ఇడ్లీ లేదా దోస పిండిని రాత్రంతా నానబెడతాం. ఇలా చేయడం వల్ల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నానబెట్టిన పిండి వల్ల మన శరీరం ఇనుము (Iron), జింక్ వంటి ఖనిజాలను సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల బి-విటమిన్లు పెరుగుతాయి. ఈ ఆహారాలు కడుపులో చాలా తేలికగా ఉండి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
ఇతర ఆరోగ్య ఆహారాలు
ధోక్లా ఇది కడుపుకు తేలికగా ఉంటూ, పోషకాలను అందిస్తుంది.
కంజి.. నల్ల క్యారెట్లతో చేసే ఈ పానీయం జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది.
చల్లటి మజ్జిగ.. భోజనం తర్వాత మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోబయోటిక్స్ అందుతాయి.
ALSO READ : పిల్లలు చదువుకునేందుకు గది ఏ వైపు ఉండాలి...
మన ఆహారంలో వాడే పసుపు, జీలకర్ర వంటి మసాలాలు మన కడుపులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంలా (Prebiotics) పనిచేస్తాయి. అందుకే విదేశీ ఆహారాల కంటే, మన దేశంలో పండే పంటలతో, మన పద్ధతుల్లో చేసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి రక్షణ కవచం.
