ఏపీలో పలు శాఖల సర్వర్లు నిలిచిపోయాయి. శనివారం ( ఏప్రిల్ 11 ) రాష్ట్రవ్యాప్తంగా మీసేవ, ఏపీసేవ, పోలీస్, రెవెన్యూ ఇలా పలు శాఖలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత నెల రోజులుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నామని.. తరచూ సర్వర్లు నిలిచిపోతుండటంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నామని అంటున్నారు మీసేవ నిర్వాహకులు. సర్వర్ సమస్య వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని.. అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు జనం.
తిరుమలలో కూడా సర్వర్ సమస్య:
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సర్వర్ సమస్య ప్రభావం తిరుమలపై కూడా పడింది. సర్వర్ సమస్య కారణంగా తిరుమలలో శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ నిలిచిపోయింది. సర్వర్ అంతరాయం కారణంగా శ్రీవాణి పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు.
Also Read : తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం సేల్స్
దీంతో ఆఫ్‌లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది టీటీడీ. అన్నమయ్య భవనం ఎదురుగా ఉన్న శ్రీవాణి కౌంటర్‌లో మధ్యాహ్నం 1:10 గంటల నుంచి టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ.
