సర్ఫరాజ్ ను ఆడుకుంటున్నారు : మొన్న ఆవలింతలు..ఇప్పుడు ధోనీ క్యాచ్

సర్ఫరాజ్ ను ఆడుకుంటున్నారు : మొన్న ఆవలింతలు..ఇప్పుడు ధోనీ క్యాచ్

వరల్డ్ కప్-2019లో భాగంగా ఇటీవల జరిగిన ఇండియా, పాక్ మ్యాచ్ లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఆవలింతలపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఇంట్రెస్టింగా మ్యాచ్ చూస్తుంటే నీకు స్టేడియంలోనే నిద్ర వస్తుందా అంటు నెటిజన్లు ఆడుకున్నారు. గుడ్ కీపర్ కాదు గ్రౌండ్ స్లీపర్ అంటూ కామెంట్స్ చేశారు. సర్ఫరాజ్ ఆవలింతల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలాఉంటే మరోసారి వార్తలో నిలిచాడీ గ్రౌండ్ స్లీపర్. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ క్యాచ్ పట్టాడు సర్ఫరాజ్. అచ్చం ధోనీ టైప్ పట్టిన క్యాచ్ ను.. ఇద్దరిలో ఎవరు చక్కగా క్యాచ్ పట్టారు..? అని ట్వీట్ చేసింది.  వీరిద్దరు వేర్వేరు మ్యాచుల్లో క్యాచ్ లు పట్టిన వీడియోను ట్వీట్ చేసింది ICC. దీంతో ధోనీతో సర్ఫరాజ్ కు పొలికా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ధోనీ ఫిట్‌నెస్ ప్రమాణాల్ని సర్ఫరాజ్ అందుకోలేడంటూనే.. పాక్ కెప్టెన్‌కి చురకలు అంటిస్తున్నారు.  ఓ క్రికెట్ అభిమాని సర్ఫరాజ్‌ని విమర్శిస్తూ బహిరంగంగానే ‘నువ్వు పందిలా ఉన్నావంటూ’ అంటూ హేళన చేశాడు. అయితే.. ఆ తర్వాత ఆ అభిమాని క్షమాపణలు చెప్పి తప్పుని దిద్దుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. అప్పటికే ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.