హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్ శతాబ్ది  ఆత్మహత్య 

 హైదరాబాద్ లో ఫ్యాషన్ డిజైనర్ శతాబ్ది  ఆత్మహత్య 

హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకున్నారు. మై హోం విహంగ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల శతాబ్ది తన ఫ్లాట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న శతాబ్ది గదిలో నుంచి దుర్వాసన రావడం గమనించిన తోటి రూమ్మేట్స్ వెంటనే అపార్ట్మెంట్ సెక్యూరిటీకి సమాచారం అందించారు. గది తలుపులు బద్దలు కొట్టి చూడగా  శతాబ్ది చున్నీతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే  గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. శతాబ్ది ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.