ఒలింపిక్స్‌‌‌‌కు ఫెడరర్‌‌‌‌ దూరం

ఒలింపిక్స్‌‌‌‌కు ఫెడరర్‌‌‌‌ దూరం

లుసానె: స్విట్జర్లాండ్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ గ్రేట్‌‌‌‌ రోజర్‌‌‌‌ ఫెడరర్‌‌‌‌.. టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో బరిలోకి దిగడం లేదు. మోకాలి గాయం కారణంగా మెగా ఈవెంట్‌‌‌‌ నుంచి విత్‌‌‌‌ డ్రా అయినట్లు ట్విటర్‌‌‌‌ ద్వారా మంగళవారం ప్రకటించాడు.  వింబుల్డన్‌‌‌‌లో మోకాలి గాయానికి గురయ్యానని, ఆల్రెడీ రిహాబిలిటేషన్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేశానని వెల్లడించాడు. ఇటీవల ముగిసిన వింబుల్డన్‌‌‌‌లో ఫెడరర్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌ ఫైనల్లోనే తన పోరాటాన్ని ముగించాడు. కాగా, స్పెయిన్‌‌‌‌ బుల్‌‌‌‌ రఫెల్‌‌‌‌ నడాల్‌‌‌‌ ఈ ఒలింపిక్స్‌‌‌‌లో ఆడటం లేదని ఇదివరకే ప్రకటించాడు. జొకోవిచ్‌‌‌‌ కూడా బరిలోకి దిగేది అనుమానంగానే ఉంది.