హైదరాబాద్‌సిటీ,వెలుగు: బస్సులో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ అకస్మాత్తుగా కడుపునొప్పితో విలవిల్లాడగా.. కండక్టర్ అప్రమత్తమై ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం హైదరాబాద్–కల్వకుర్తి రూట్లో బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు తుక్కుగూడకు రాగానే కడుపు నొప్పి ప్రారంభమైంది. ఈ విషయాన్ని గమనించిన కల్వకుర్తి డిపో కండక్టర్శశికళ, డ్రైవర్ అంజయ్యను ఆప్రమత్తం చేశారు. బస్సును ఆపి అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో ఆ మహిళను కడ్తాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రయాణికురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు, మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపించుకోవడం సంతోషకరమని అన్నారు.

