V6 News

జ్యోతిష్యం:  సంఖ్యాశాస్త్రం.. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు మహరాణిలే 

జ్యోతిష్యం:  సంఖ్యాశాస్త్రం.. ఈ తేదీల్లో పుట్టిన మహిళలు మహరాణిలే 

సంఖ్యాశాస్త్రం కేవలం  అంకెలు లెక్కించడానికి మాత్రమే కాదు, ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక రకమైన శక్తి దాగి ఉంటుందని న్యూమరాలజీ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ఒక్కో సంఖ్య నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి పుట్టినతేదిని బట్టి అతని వ్యక్తిత్వం.. పనితీరు.. ప్రవర్తన..భవిష్యత్తు గురించి సంఖ్యాశాస్త్ర నిపుణులు అంచనా వేస్తారు.  న్యూమరాలజీ సిద్దాంతం కొన్ని తేదీల్లో జన్మించిన మహిళలు మహారాణుల్లా జీవిస్తారని .. వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఏతేదీల్లో జన్మించిన మహిళలు క్వీన్​ లైఫ్​ గడుపుతారో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!

సంఖ్యా శాస్త్రం ఒక వ్యక్తి స్వభావం, ఆలోచన , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. 0 నుంచి 9 వరకు ఉన్న ప్రతి సంఖ్య ఏదో ఒక గ్రహం.. ప్రకృతి .. జీవన సూత్రంతో సంబంధం కలిగి ఉంటుదని  సంఖ్యాశాస్త్ర పండితులు చెబుతున్నారు. 

సంఖ్యాశాస్త్రంలో కొన్ని తేదీల్లో జన్మించిన మహిళలు రాణులుగా వ్యవహరిస్తారు.  అధికారం చెలయించడం.. అంతా తానై శాసించడం వంటివి చేస్తుంటారు.  అలాంటి వారికి రాణి శక్తి ఉందని న్యూమరాలజిస్ట్​లు అంటుంటారు. కొన్ని తేదీలలో జన్మించిన మహిళలు సహజంగానే నాయకత్వ లక్షణాలు..ఆత్మవిశ్వాసం.. ఆకర్షణ కలిగి ఉంటారు. 

జన్మించిన తేదీ ఆధారంగా పుట్టుకతో వచ్చే లక్షణాలను పండితులు అంచనా వేస్తారు. 1, 3, 6, 9 అంకెలు కలిసే రోజులలో జన్మించిన మహిళలు ఆధిపత్య ధోరణి కలిగి ఉంటారు.  వీరు చాలా శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు.  ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

మహారాణి పుట్టుక: సంఖ్యా శాస్త్రం ప్రకారం 1 సంఖ్య సూర్యునికి సంబంధించినది.  ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన మహిళలు స్వతంత్రంగా ఎదిగి.. నాయకత్వాన్ని సాధిస్తారు.  ఈ తేదీల్లో జన్మించిన మహిళల ఆశయాలు..ఆదర్శాలు చాలా వింతగా ఉంటాయి.  వీరి ఆత్మవిశ్వాసానికి ఎదురే లేదని సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఇక వీరు తీసుకొనే ప్రతి నిర్ణయం కచ్చితంగా అమలు చేయాల్సిందే అన్న ధోరణితో ఉంటారు.  అంటే  ఈ 1, 10, 19, 28 పుట్టిన మహిళలు రాజసత్వాన్ని కలిగి.. మహారాణిలా వ్యవహరిస్తారు. 

ఆకర్షించే మహిళలు:  కొన్ని తేదీల్లో జన్మించిన మహిళలు ఆకర్షణీయంగా.. ఎంతో అందంగా ఉంటారు.   సంఖ్యాశాస్త్రం ప్రకారం 3 అంకె ఆకర్షణకు సంబంధించినది. శాస్త్రాల ప్రకారం 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన మహిళలు చైతన్యవంతంగా ఉంటారు.  వీరు అందరితో కలిసిపోతారు.  జనాలను ఆకర్షించే విధంగా వీరి చర్యలు ఉంటారు.  సామాజికంగా వీరు తీసుకొనే నిర్ణయాలు చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. 

హుందాగా వ్యవహరించే మహిళలు:న్యూమరాలజీ ప్రకారం  6, 15, 24 తేదీల్లో జన్మించిన స్త్రీలకు ప్రతి పనిలో కూడా చాలా శ్రద్ద కలిగి ఉంటారు. సమాజంలో చాలా హుందాగా వ్యవహరిస్తారు.  ఈ తేదీలు (6,15,24)  శుక్రునికి సంబంధించినవి.  ఈ తేదీల్లో పుట్టిన మహిళలు ప్రేమగా.. ఆప్యాయతగా ఉంటారు.  వారి మాటల్లో  హుందాతనం, రెస్పాన్స్​బిల్టీ ఉంటుంది. సహజంగా వీరు ఐశ్వర్యమంతుల కుటుంబంలో జన్మిస్తారు.

శక్తివంతమైన మహిళలు :  సంఖ్యాశాస్త్రంలో 9 సంఖ్య అంగారకుడిని ప్రభావితం చేస్తుంది.  ఈ అంకెతో సంబంధమున్న తేదీల్లో అనగా  9, 18, 27 తేదీల్లో జన్మించిన మహిళలు చాలా శక్తివంతంగా ఉంటారు.  ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు.  మానవతా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. చుట్టు పక్కల జరిగే ఘటనలను అబ్జర్వ్​ చేస్తుంటారు. 9,18,27 రోజుల్లో పుట్టిన మహిళలు దైర్యవంతులుగా, నిర్భయంగా ఉంటారు. ప్రపంచాన్ని మార్చాలనే తపన వారిలో ఉంటుంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.