V6 News

ఏపీలో మూడు పెట్రోల్‌ బంకులు సీజ్‌...

ఏపీలో మూడు పెట్రోల్‌ బంకులు సీజ్‌...

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా కొన్ని పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పల్నాడు జిల్లా అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న బంకులను సీజ్ చేశారు అధికారులు.

రాష్ట్రంలో నెలకొన్న కొరతను ఆసరాగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేపట్టిన ఫిల్లింగ్ స్టేషన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో ఉన్న మూడు పెట్రోల్ బంకులను సీజ్ చేశారు అధికారులు.

పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలో జనతా ఫిల్లింగ్ స్టేషన్, నరసరావుపేటలో శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్,లపై చర్యలు తీసుకున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా పెట్రోల్ డీజిల్ అమ్మకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. వరుసగా మూడు బంకులను సీజ్ చేసిన క్రమంలో  జిల్లాలోని ఇతర పెట్రోల్ బంకుల యాజమాన్యాల్లో కలవరం మొదలైంది.