కొత్త ఆధార్ కార్డు యాప్ వచ్చినప్పటినుంచి చాలా చోట్ల ఆధార్ కార్డు జీరాక్స్ కాపీ ఇవ్వాల్సి వస్తోంది.దీంతో పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుందేమోనని చాలామందిలో భయం పట్టుకుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆధార్ కార్డు డిజైన్ లో మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ డిజైన్ లో మార్పుతో ఆధార్ కార్డు నుంచి పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ , ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని తొలగించడం ద్వారా వినియోగదారుల ప్రైవసీని మెరుగుపడతాయని చెబుతోంది. మీ ఆధార్ కార్డు జీరాక్స్ కాపీని ఉపయోగించాల్సి వచ్చిన డేటా దుర్వినియోగం అవుతుందని భయం ఉండదని స్పష్టం చేస్తోంది ఆధార్ సంస్థ ఉడాయ్..
కొత్త ఆధార్ కార్డు ఎలా ఉండబోతోందంటే..
రిపోర్టుల ప్రకారం.. ఆధార్ కార్డు కొత్త డిజైన్ చాలా భిన్నంగా ఉండనుంది. ఇంతకుముందుకు కార్డు లా కాకుండా కార్డుపై కేవలం ఫొటో క్యూ ఆర్ కోర్డు మాత్రమే డిస్ ప్లే అవుతాయి. ఈ క్యూఆర్ కోడ్ తో ప్రయోజనం ఏంటంటే.. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్ అన్నీ వివరాలు ఈ క్యూ ఆర్ కోడ్ లో దాగి ఉంటాయి. ఈ కోడ్ ను కేవలం ప్రభుత్వ అనుమతిపొందిన స్కానర్ లేదా అధికారిక ఉడాయ్ యాప్ ఉపయోగించి మాత్రమే డిటెయిల్స్ పొందవచ్చు. ఇది ఆధార్ కార్డు ఫిజికల్ కాపీని ఉపయోగించడం ద్వారా వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదాన్ని నివారించవచ్చు.
ఆధార్ కార్డు డిజైన్ ఎందుకు మారుస్తున్నారు..
ఆధార్ కార్డు లోని డేటా దుర్వినియోగం కాకుండా, వ్యక్తి గత ప్రైవసీని కాపాడటం కోసం ఆధార్ కార్డు డిజైన్ ను మారుస్తున్నట్లు ఉడాయ్ చెబుతోంది. మీరు ఎప్పుడైనా ఫిజికల్ ఆధార్ కార్డు గానీ, ఫొటో కాపీ గానీ ఇతరులకు ఇచ్చినప్పుడు మిస్ యూజ్ అయి మీ ప్రైవసీకి, భద్రతకు ముప్పు కలగవచ్చు. ఆధార్ కార్డులో ఫోటో, క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉన్నప్పుడు కార్డు దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయంటున్నారు అధికారులు.
మరోవైపు ఆధార్ డిజిటల్ వినియోగాన్ని పెంచేందుకు ఉడాయ్ ఇప్పటియే కొత్త యాప్ ను తీసుకొచ్చింది.దీంతో స్కాన్ చేసి సమాచారాన్ని ధృవీకరించడం ఈజీ అవుతోంది. ఇప్పుడు కార్డును రీడిజైన్ చేయడం ద్వారా మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
కొత్త కార్డు వచ్చే వరకు మనమేం చేయాలి..
ప్రస్తుతానికి ఆధార్ కొత్త కార్డు వచ్చే వరకు మీ ఆధార్ కార్డు ఫిజికల్ కాపీని ఉపయోగించడానికి బదులుగా ఆధార్ యాప్‌ను ఉపయోగించాలని ఉడాయ్ సూచిస్తోంది. ప్రభుత్వం కొత్త ఆధార్ డిజైన్‌ను అధికారికం చేసిన తర్వాత, మీరు UIDAI వెబ్‌సైట్ ద్వారా కొత్త ఆధార్ భౌతిక ప్రతిని ఆర్డర్ చేసుకోవచ్చు. PVC ఆధార్ కార్డును ఆర్డర్ చేసే విధానం మాదిరిగానే కొత్త కార్డును పొందవచ్చు.

