తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తిల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ సౌత్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కాపురంలో చిచ్చు పెట్టడానికి కారణం పాప్ సింగర్, స్పిరిచువల్ థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్ అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చంపేస్తామంటూ హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. అయితే, లేటెస్ట్ గా కెనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన సుదీర్ఘమైన ఎమోషనల్ పోస్ట్, ఆ వెంటనే జయం రవి నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కెనీషా భావోద్వేగ విడ్కోలు..
కెనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ లో.. ఈ కథలోకి నేను ఎంతో ప్రేమతో అడుగుపెట్టాను, కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుదిరుగుతున్నాను. అబద్ధాల కోరులు, మాయగాళ్లతో నిండిపోయిన ఈ లోకంలో మంచితనానికి విలువ లేదు. అతడు (Jayam Ravi) ఇక పూర్తిగా మీవాడే.. నేను అతడిని పూర్తిగా వదులుకుంటున్నాను అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. ఆన్‌లైన్ వేధింపుల వల్లే తాను చెన్నై నగరాన్ని, తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని, థెరపీని వదులుకుని వెళ్లిపోతున్నట్లు, ఇన్‌స్టా ఖాతాను కూడా డిలీట్ చేస్తున్నట్లు ప్రకటించింది. చివరికి ఫెమినిజం గెలిచింది.. సంతోషం ఓడిపోయింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ : 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా..
మంచికి చోటు లేదు
ఈ ప్రపంచంలో త్యాగాలు చేసిన జీవితంలోని నిజాల కంటే .. భావోద్వేగాలతో అల్లిన కథలనే ఎక్కువలగా నమ్ముతారు. చివరికి మీరు కోరుకున్నదే జరిగింది అంటూ పోస్ట్ చేసింది. ఇక్కడ మంచికి చోటు లేదు. ఇకపై నేను పోరాడలేను.. ఎలాంటి యుద్ధాలు చేయలేను. మంచి వ్యక్తులకు జీవించే అవకాశం ఇవ్వాలని అనుకోవడం.. వారికి అండగా నిలబడాలని ముందుకురావడం అంతా నా అమాయకత్వం అంటూ నోట్ లో రాసుకోచ్చింది. ఒక ఆడియో లాంచ్‌లో జయం రవితో పరిచయం ఏర్పడిందని, తమది కేవలం స్నేహబంధం మాత్రమేనని, కాపురం కూల్చాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది.
స్టేజ్‌పై జయం రవి కన్నీరు..
కెనీషా చెన్నై వదిలి వెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జయం రవి ప్రెస్ మీట్ పెట్టి లైవ్‌లోనే కన్నీరు పెట్టుకున్నారు. గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో నేను ఒక బానిసలా బతికాను. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే లాక్కున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయి లేదు, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒకానొక దశలో భరించలేక తాను మణికట్టు కోసుకున్నానని, అయినా సరే మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లానంటూ తన పెయిన్ పంచుకున్నారు.
ఆ నటి వల్లే నా జీవితం నాశనం..
పేరు చెప్పకుండా ఇండస్ట్రీలోని ఒక ‘మూడక్షరాల ఇడ్లీ నటి’పై రవి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ నటి నా జీవితాన్ని నాశనం చేసింది. ఎన్నో కుటుంబాలను కూల్చిన ఆమె.. పబ్లిక్ ఫోరమ్స్‌లో ఫెమినిజం గురించి మాట్లాడటం విడ్డూరం. నా తోడల్లుడు ప్రసాద్ కూడా ఆ ఇంట్లో నాలాగే నరకం అనుభవించి బయటపడ్డాడు అని బాంబు పేల్చారు.
నా విడాకులు పూర్తయ్యే వరకు, నా సమస్యలు తీరేంత వరకు నేను ఇకపై సినిమాల్లో నటించను.. నా సినిమాలు థియేటర్లలోకి రావు. ఇకపై నేను సైలెంట్‌గా ఉండను, చూసుకుందాం రండి.. అంటూ జయం రవి ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ లవ్, డివోర్స్ అండ్ రివెంజ్ డ్రామా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆ ' మూడక్షరాల ఇడ్లీ నటి' ఎవరు అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
SHOCKINGLY STATMENT of Jayam Ravi in Press Meet !!
— Let's X OTT GLOBAL (@LetsXOtt) May 16, 2026
“ First of all, what I need to say is... my movies will not be released on screens from now on, until I get my divorce. I am not going to act anymore because I am not able to act.
I cannot bear the insults !!! the unnecessary… pic.twitter.com/eXL0hgy63B
