Jayam Ravi: 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన జయం రవి !

Jayam Ravi: 14 ఏళ్లు భార్యతో బానిసలా బతికా.. మీడియా ముందు బోరున ఏడ్చేసిన జయం రవి !

తమిళ  స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) వ్యక్తిగత జీవితం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. భార్య ఆర్తితో విడాకుల ప్రకటన నాటి నుంచి నివురు గప్పిన నిప్పులా ఉన్న వివాదం.. లేటెస్ట్ గా ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌తో ఒక్కసారిగా బద్దలైంది. మీడియా ముందు జయం రవి కన్నీరు పెట్టుకుంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నా విడాకులు పూర్తయ్యే వరకు నేను సినిమాల్లో నటించను.. నా సినిమాలు థియేటర్లలోకి రావు అంటూ రవి షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న నరకాన్ని, అవమానాల గురించి వెల్లడిస్తూ కన్నీరు పెట్టుకున్నారు..

నా జీవితాన్ని నరకం చేశారు..

ప్రెస్ మీట్‌లో జయం రవి ఆవేదన వ్యక్తం చేస్తూ.. గత 14 ఏళ్ల వైవాహిక జీవితంలో తాను ఒక బానిసలా బతికానని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల ఆస్తులన్నీ భార్య వైపు వాళ్లే లాక్కున్నారు. కనీసం నా పేరు మీద ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా చేశారు. ఇల్లు వదిలి వచ్చేటప్పుడు నా చేతిలో రూపాయి లేదు, ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నాను అంటూ రవి భావోద్వేగానికి గురయ్యారు. ఒకానొక దశలో మనస్తాపంతో తాను మణికట్టు కోసుకున్నానని, అయినా సరే మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లానంటూ తన పెయిన్ పంచుకున్నారు.

 

టార్గెట్ అయిన సింగర్ కెనీషా.. 

జయం రవి విడాకులకు పాప్ సింగర్, స్పిరిచువల్ థెరపిస్ట్ కెనీషా ఫ్రాన్సిస్ కారణమంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. చంపేస్తామంటూ హత్యా బెదిరింపులు రావడంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురై చెన్నై నగరాన్ని, తన కెరీర్‌ను వదిలి వెళ్ళిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. జయం రవి, ఆర్తితో విడాకులకు నేనెలా కారణమని చెప్పారు. 

ALSO READ : ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. 

దీనిపై స్పందించిన రవి.. సైబర్ బుల్లీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే, పేరు చెప్పకుండా ఒక ‘మూడక్షరాల ఇడ్లీ నటి’పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "ఆ నటి నా జీవితాన్ని నాశనం చేసింది. ఎన్నో కుటుంబాలను కూల్చిన ఆమె.. పబ్లిక్ ఫోరమ్స్‌లో ఫెమినిజం గురించి మాట్లాడటం విడ్డూరం. నా తోడల్లుడు ప్రసాద్ కూడా ఆ ఇంట్లో నాలాగే నరకం అనుభవించి బయటపడ్డాడు" అని బాంబు పేల్చారు.

సినిమాలకు బ్రేక్..

"నా పిల్లల భవిష్యత్తు కోసమే ఇన్నాళ్లూ నోరు మూసుకున్నాను. కానీ ఇప్పుడు నా పిల్లలను కూడా నన్ను చూడనివ్వడం లేదు. వాళ్లను స్కూలుకు కూడా సెక్యూరిటీ గార్డుల కాపలాతో పంపుతున్నారు.  ఇకపై నేను సైలెంట్‌గా ఉండను. నా విడాకులు అయ్యేంత వరకు, నా సమస్యలు తీరేంత వరకు నేను సినిమాల్లో నటించను, నా సినిమాలు రిలీజ్ కావు అంటూ జయం రవి ఇండస్ట్రీకి షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం జయం రవి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా..  మరోవైపు ఆ మూడక్షరాల నటి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.