Allu Arjun: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బన్నీ మేనరిజమ్స్, డాన్స్ స్టెప్స్‌కు లీగల్ ప్రొటెక్షన్!

Allu Arjun: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. బన్నీ మేనరిజమ్స్, డాన్స్ స్టెప్స్‌కు లీగల్ ప్రొటెక్షన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ ఊచకోత తర్వాత.. గ్లోబల్ వైడ్‌గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సరికొత్త కాంబినేషన్‌తో వస్తున్నారు. ‘జవాన్’ చిత్రంతో ఇండియన్ సినిమాను షేక్ చేసిన అట్లీ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న మెగా సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) యాక్షన్ విజువల్ వండర్ ‘రాక’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ గురించి మైండ్ బ్లోయింగ్ అండ్ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీస్టెప్స్, మేనరిజమ్స్‌కు ‘లీగల్ ప్రొటెక్షన్’!

నార్మల్‌గా అల్లు అర్జున్ ఒక సినిమా చేశారంటే అందులోని డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్, డాన్స్ స్టెప్స్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతాయి. గతంలో ‘పుష్ప’లోని “తగ్గేదే లే” మేనరిజం, శ్రీవల్లి స్టెప్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు అందరూ దాన్ని కాపీ కొట్టారు. అయితే, ఈసారి ‘రాక’ సినిమా విషయంలో మేకర్స్ అసలు తగ్గడం లేదు. 

సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో బన్నీ ఉపయోగించే విలక్షణమైన మేనరిజమ్స్, డైలాగ్ స్టైల్స్, ఐకానిక్ డాన్స్ స్టెప్స్‌ను ఇతరులు కమర్షియల్‌గా వాడకుండా ఉండేందుకు ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి కాపీరైట్ ప్రొటెక్షన్ (Legal Protection) కోరినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి లీగల్ స్టెప్ తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవెల్!

ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘రాక’ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట విద్వంసం సృష్టించింది. కళ్ళకు కాటుక, నెరిసిన గడ్డం, విభిన్నమైన హెయిర్‌స్టైల్‌తో ముఖాన్ని ఒక వింత గోరుతో కప్పి ఉంచిన బన్నీ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ ఇంతటి ఊహాతీతమైన డార్క్-మానస్టర్ రోల్‌లో కనిపించబోతుండటం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది..

నలుగురు స్టార్ హీరోయిన్లు..

ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, క్రేజీ బ్యూటీస్ మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో మెరవనున్నట్లు సమాచారం. ఇంతటి భారీ స్టార్ కాస్టింగ్‌తో అట్లీ ఈ సినిమాను ప్లాన్ చేశారు. ప్రస్తుతం ‘రాక’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, విజువల్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కీలకమైన యాక్షన్ సీన్లను రీ-షూట్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సినిమా విడుదల కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, థియేటర్లలో మాత్రం విజువల్స్ పీక్స్ లో ఉంటాయని టాక్ వినిపిస్తోంది.