ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్–2026 జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌.. ప్రణతి నాయక్‌‌‌‌‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌

ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్–2026 జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌.. ప్రణతి నాయక్‌‌‌‌‌‌‌‌కు సిల్వర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: తాష్కెంట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్–2026 జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. ఆదివారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ రెండు వాల్ట్‌‌‌‌‌‌‌‌లలో ప్రణతి వరుసగా 12.950, 12.700 పాయింట్లు సాధించి.. మొత్తంగా 13.025 సగటు స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది.

దాంతో ఆసియా చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే మూడు పతకాలు సాధించిన ప్రణతి ఖాతాలో మరో అంతర్జాతీయ పతకం చేరింది. వియత్నాం ప్లేయర్ థీ క్విన్‌‌‌‌‌‌‌‌ నుహ్‌‌‌‌‌‌‌‌ ఎన్గుయెన్‌‌‌‌‌‌‌‌ (13.375) స్వర్ణం, ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన షాఖినాబోను యుసుఫోవా (12.950) కాంస్యం గెలుచుకున్నారు. ఇండియాకు చెందిన  ప్రొతిష్ఠ సమంత 12.850 స్కోరుతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.