
సినీ నటి పూర్ణ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను త్వరలో తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ శుభ సందర్భాన్ని భర్త ఆసిఫ్ అలీ, కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ వార్త విన్న అభిమానులు పూర్ణకి శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
కేరళకు చెందిన పూర్ణ అసలు పేరు షమ్న ఖాసిమ్. ఈవిడ అక్టోబర్ 24న దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ జేబీఎస్ కంపెనీ వ్యవస్థాపకుడు షానిద్ ఆసిఫ్ అలీని వివాహమాడింది. దుబాయ్ లో జరిగిన వీరి వివాహానికి అతి తక్కువ మందిని పిలిచి జరుపుకున్నారు.