20లక్షల కోట్ల బడ్జెట్ లో ఎవరికి ఎంత కేటాయించారంటే

20లక్షల కోట్ల బడ్జెట్ లో ఎవరికి ఎంత కేటాయించారంటే

కరోనా వైరస్ నుంచి దేశాన్ని ఆర్ధికంగా ఆదుకునేలా ప్రధాని నరేంద్ర మోడీ  రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్యాకేజి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈరోజు నుంచి వరుసగా రెండు రోజుల పాటు వివిధ ప్యాకేజీలను ప్రజల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. నిర్మాలా సీతారామన్ తెలిపిన వివరాల ఆధారంగా

  1. కొల్లేటరీ గ్యారెంటీ లేకుండా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని స్థాపించేందుకు రూ.3 లక్షల కోట్లు రుణాలు
  2. లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని ఆదుకునేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఈక్విటీ సపోర్ట్‌తో పరిశ్రమల్ని ఆదుకునేందుకు  20 వేల కోట్లను నిర్మలా సీతారామ్ ప్రకటించారు.
  3. కరోనా లాక్ డౌన్ వచ్చినా తట్టుకుని నిలబడిన ఎంఎస్ఎంఈల కోసం రూ.50వేల కోట్ల ఈక్విటీ ఫండ్ కేటాయింపు
  4. ఎంఎస్ ఎంఈ అంటే అర్థం మార్పు. రూ.కోటితో పెట్టుబడి పెట్టినా అది సూక్ష్మ తరహా కంపెనీనే అని అర్ధం.
  5. ప్రభుత్వంలో రూ.200 కోట్ల వరకు టెండర్లకు గ్లోబల్ టెండర్లకు అనుమతి లేదు.
  6. జూన్‌, జులై, ఆగస్టు నెలల పీఎఫ్‌ మొత్తం రూ.2500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది .
  7. ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. బిజినెన్, వర్కర్ల ఈపీఎఫ్ కంటిబ్యూషన్‌ను మూడు నెలల పాటు తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకోసం రూ.6,750 కోట్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు.
  8. మైక్రో కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల కోసం 30 వేల కోట్ల రూపాయల మొత్తంతో స్పెషల్ లిక్విడిటీ స్కీమ్‌ను ప్రకటించినట్లు తెలిపారు.
  9. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల కోసం లిక్విడిటీ రూపంలో మరో 45 వేల కోట్లు కేటాయింపు
  10. దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ కంపెనీ (డిస్కమ్)లకు 90 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని లిక్విడిటీ రూపంలో కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రభుత్వం నిర్వహించిన టెండర్ల ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వాటిని పూర్తి చేయాల్సిన గడువును ఆరు నెలల పాటు పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గూడ్స్, సర్వీస్ కాంట్రాక్టు పనులను దీని పరిధిలోకి తీసుకోవచ్చని అన్నారు.
  11. ఈ ఏడాది మార్చి 25వ తేదీ తరువాత గడువు ముగిసిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల డెవలపర్ల దరఖాస్తులకు అనుమతి. ఆయా ప్రాజెక్టుల రిజిస్ట్రేన్, పూర్తి చేయాల్సిన గడువును ఆరు నెలల పాటు పొడిగించేలా చర్యలు
  12. రేపటి నుంచి మార్చి 2021 నాటి వరకు చెల్లించాల్సిన టీడీఎస్‌, టీసీఎస్‌ 25 శాతం కుదింపు. ఫలితంగా ఖాతాదారులకు 50 వేల కోట్ల రూపాయలు లబ్ధి.
  13. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ పే చేయాల్సిన గడువు జులై 31 ఉండగా..ఇప్పుడు ఆ గడువు ను అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30 వరకు పే చేయాల్సి ఉండగా..ట్యాక్స్ ఆడిట్ సెప్టెంబర్ 30నుంచి అక్టోబర్ 31వరకు జరగనుంది.
  14. కార్పొరేట్ , బిజినెస్ సంబంధించిన ఛారిటబుల్ ట్రస్ట్ లకు కాకుండా మిగిలిన ఛారిటబుల్ ట్రస్ట్ లకు పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపులు