బెంగళూరు​లో రేవ్ పార్టీ.. 8 మంది అరెస్టు, అదుపులో మరో 78 మంది

బెంగళూరు​లో రేవ్ పార్టీ..  8 మంది అరెస్టు, అదుపులో మరో 78 మంది
  •  డ్రగ్స్, ఖరీదైన కార్లు స్వాధీనం.. ఓ కారులో ఏపీ ఎమ్మెల్యే కాకాణి స్టిక్కర్ 
  • పార్టీకి హైదరాబాద్, ఏపీ నుంచి 100 మంది హాజరు 
  • 25 మంది మహిళలు సహా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు
  • హీరో శ్రీకాంత్, నటి హేమ అరెస్ట్ అయినట్టు ప్రచారం 
  • తాము హైదరాబాద్​లోనే ఉన్నామని వీడియోలు రిలీజ్ 

హైదరాబాద్‌‌, వెలుగు: కర్నాటకలోని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగింది. దీనిపై సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు ఆర్గనైజర్లు, ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌‌ సిటీ సమీపంలో ఉన్న జీఆర్‌‌‌‌ ఫామ్‌‌హౌస్‌‌లో ఆదివారం రాత్రి బర్త్ డే పార్టీ పేరుతో వేడుకలు నిర్వహించారు. దీన్ని హైదరాబాద్ కు చెందిన వాసు అనే వ్యక్తి ఆర్గనైజ్ చేశాడు. ఇందులో హైదరాబాద్‌‌, ఏపీకి చెందిన దాదాపు 100 మంది పాల్గొన్నారు. వీరిలో 25 మంది మహిళలు సహా సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. 

అయితే, ఇక్కడ బర్త్‌‌‌‌‌‌‌‌ డే పేరుతో మోడల్స్‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్టులతో రేవ్‌‌‌‌‌‌‌‌ పార్టీ నిర్వహించారు. లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వినియోగించారు. జీఆర్ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో రేవ్‌‌‌‌‌‌‌‌ పార్టీ జరుగుతున్నట్టు స్థానికుల నుంచి సమాచారం అందడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు.

పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 17 ఎండీఎంఏ డ్రగ్ ట్యాబ్లెట్స్‌‌‌‌‌‌‌‌, కొకైన్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో పార్క్‌‌‌‌‌‌‌‌ చేసిన మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ లాంటి 15 ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్న కారు కూడా ఉంది. పార్టీలో పట్టుబడినోళ్ల వివరాలను పోలీసులు సేకరించారు. దాదాపు 78 మందిని అదుపులోకి తీసుకున్నారు.

వీళ్లు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు టెస్టులు చేయనున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిలో తెలుగు సినీ, టీవీ నటీనటులు, మోడల్స్, టెకీలు, బడాబాబులు ఉన్నట్టు తెలిసింది. రేవ్ పార్టీపై ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ సిటీ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ చంద్రగుప్తా తెలిపారు. 

టాలీవుడ్​కు లింకులు? 

రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఫామ్​హౌస్​లో పట్టుబడిన వారిని పోలీసులు స్టేషన్​కు తరలిస్తుండగా.. వారిలో హీరో శ్రీకాంత్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. మరోవైపు నటి హేమను కూడా అరెస్టు చేసినట్టు సోషల్ మీడియాలో వైరలైంది. అయితే, తాము ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్​లోనే ఉన్నామని శ్రీకాంత్, హేమ వీడియోలు విడుదల చేశారు. సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని కోరారు.  

హైదరాబాద్​లోనే ఉన్నా.. 

బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. నేను హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నాను. బెంగళూరులో ఎలాంటి పార్టీకి వెళ్లలేదు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఓ ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో చిల్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాను. నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు.  

- హేమ,  నటి 

అది నేను కాదు.. 

నేను హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లోని మా ఇంట్లోనే ఉన్నాను. బెంగుళూరులో రేవ్ పార్టీకి వెళ్లిన‌‌‌‌‌‌‌‌ట్టు, పోలీసులు అరెస్ట్ చేసిన‌‌‌‌‌‌‌‌ట్టు సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీలో దొరికిన‌‌‌‌‌‌‌‌ అత‌‌‌‌‌‌‌‌నెవ‌‌‌‌‌‌‌‌రో గానీ కొంచెం నాలాగే ఉన్నాడు. అత‌‌‌‌‌‌‌‌డికి కాస్త గ‌‌‌‌‌‌‌‌డ్డం ఉంది. ముఖం క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్ చేసుకున్నాడు. నేనే షాక్‌‌‌‌‌‌‌‌ అయ్యాను. ఇది చూసి నాతో పాటు మా కుటుంబ స‌‌‌‌‌‌‌‌భ్యులంద‌‌‌‌‌‌‌‌రం న‌‌‌‌‌‌‌‌వ్వుకున్నాం. మొన్ననేమో నా భార్యతో నాకు విడాకులు ఇప్పించేశారు. ఇప్పుడేమో రేవ్ పార్టీకి వెళ్లాన‌‌‌‌‌‌‌‌ని అంటున్నారు. ద‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌చేసి ఇది ఎవ‌‌‌‌‌‌‌‌రూ న‌‌‌‌‌‌‌‌మ్మొద్దు. నేను రేవ్ పార్టీల‌‌‌‌‌‌‌‌కు, ప‌‌‌‌‌‌‌‌బ్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియ‌‌‌‌‌‌‌‌దు. ద‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌చేసి త‌‌‌‌‌‌‌‌ప్పుడు క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌నాల‌‌‌‌‌‌‌‌ను న‌‌‌‌‌‌‌‌మ్మొద్దు. 
- శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, సినీ హీరో