రాజ్యాంగంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఎక్కడి ది? : చనగాని దయాకర్

రాజ్యాంగంపై మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఎక్కడి ది? : చనగాని దయాకర్
  • బీఆర్ఎస్ నేతలను  నిలదీసిన చనగాని దయాకర్ 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భవన్​లో సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే రీతిలో ఉన్న నాటకాన్ని బీఆర్ఎస్ నేతలు ఎలా ప్రదర్శిస్తారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన గాంధీ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. 

భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఈ నాటకాన్ని డీజీపీ శివధర్ రెడ్డి వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని కోరారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అడుగడుగునా నియంతలా వ్యవహరించిన కేటీఆర్...ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు.