హైదరాబాద్ అమీర్ పేట మైత్రీవనంలోని అన్నపూర్ణ బ్లాక్ లో అగ్నిప్రమాదం జరిగింది. బిల్డింగ్ రెండో అంతస్థులోని ఓ కోచింగ్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్, డిజాస్టర్ సిబ్బంది మంటలను ఆర్పివేస్తున్నారు.
సెంటర్ లోని విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు పంపించారు. బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించినట్లు సమాచారం. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.
