ఢిల్లీలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9మంది చనిపోగా.. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి 12:30 గంటలకు జరిగినట్లు సమాచారం.
వాయువ్య ఢిల్లీలోని కిరారి ప్రాంతంలోని వస్త్ర గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ బట్టల గోడౌన్ కిరారీ ప్రాంతంలోని ఓ మూడు అంతస్తుల భవనంలో ఉంది. ఈ భవనంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏవీ లేనట్లు సమాచారం. అంతేకాకుండా ఈ బిల్డింగ్‌కు ఒకే ఒక్క మెట్ల మార్గం ఉంది. దాంతో భవనంలో ఉన్న వాళ్లు మంటల నుంచి తప్పించుకోవడం కష్టమయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడ్డవారిని చికిత్స కోసం సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటన స్థలంలో అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టింది.
ఉత్తర ఢిల్లీలోని అనాజ్ మండిలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మరణించారు. ఆ ఘటన జరిగినప్పటినుంచి అగ్ని ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
