రోల్స్​రాయ్స్ ఎలక్ట్రిక్ ప్లేన్.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 కిలోమీటర్లు

రోల్స్​రాయ్స్ ఎలక్ట్రిక్ ప్లేన్.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 320 కిలోమీటర్లు

బైకులు, కార్లు, బస్సులు.. ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ వెహికిల్స్​ సెగ్మెంట్‌లో వచ్చిన కొన్ని బండ్లు. మరి, విమానాలూ..! లేవు కదా. పర్యావరణం కోసం పోరాడుతున్న గ్రెటా థన్ బర్గ్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తింది. అందుకే కొద్ది నెలల క్రితం న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమానికి ఆమె విమానంలో కాకుండా ఓ యాట్‌లో వెళ్లింది. అయితే, ఇప్పుడు రోల్స్​ రాయ్స్​ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ ప్లేన్‌ను తయారు చేసింది. వచ్చే ఏడాది అది గాల్లో రయ్యున దూసుకెళ్లబోతోంది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ ప్లేన్‌గా రికార్డు కొట్టేసేందుకు సిద్ధంగా ఉంది. గంటకు 480 కిలోమీటర్ల వేగంతో అది దూసుకెళుతుంది మరి. ఒక్కరు ప్రయాణించే ఈ విమానానికి ఒక్కసారి చార్జింగ్ పెడితే ఆగకుండా 320 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెట్టడమంటే దాదాపు 250 ఇళ్లకు కరెంట్ సప్లై చేసినంత లెక్కట. విమానంలోని ఒకే ఒక్క ప్రొపెల్లర్ మూడు హై పవర్ డెన్సిటీ యాగ్జియల్ ఎలక్ట్రిక్ మోటార్లతో నడుస్తుందట. నిదానంగా అది తిరగడం వల్ల సౌండ్ కూడా రాదట. ఎలక్ట్రిక్ ప్లేన్ కాబట్టి కాలుష్యమన్న మాటే ఉండదు. ‘యాక్సిలరేటింగ్ ద ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ (యాక్సిల్ )’ ఇనిషియేటివ్‌లో భాగంగా రోల్స్​ రాయ్స్​ ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది.

For More News..

దారుణం: చెట్టుకు కట్టేసి కొట్టి.. నోట్లో మూత్రం పోసి..