కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..

కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..

చత్తీస్​గఢ్  కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధించిన వివరాలను రాతపూర్వకంగా సేకరించడానికి విద్యుత్ రంగ నిపుణులు, ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఇందుకోసం బహిరంగ ప్రకటన విడుదల చేసింది.

భద్రాద్రి ప్లాంట్ నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ నుంచి  కాలం చెల్లిన 270 మెగావాట్ ల బాయిలర్​లను కొనుగోలు చేసింది. ఇలా నాలుగు బాయిలర్​లకు 1080 మెగావాట్​లతో భద్రాద్రి పవర్​ ప్లాంట్​ నిర్మాణం చేపట్టింది. గ్లోబల్ టెండర్లకు పోకుండా ఇండియా బుల్స్ అనే ప్రవైటు కంపెనీ అర్డర్ పెట్టి తీసుకోకుండా ఉన్న కాలం చెల్లిన టెక్నాలజీని నామినేషన్​గా బీహెచ్ఈఎల్ నుంచి తీసుకున్నది. అలాగే నిర్మాణం కూడా ఆలస్యం అయింది. దీంతో జెన్​కోకు భారీ నష్టం కలిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

యాదాద్రి పవర్ ప్లాంట్

యాదాద్రి ప్లాంట్ వ్యవహారంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు నష్టం కలిగించేలా ఉన్నాయని, రూ.వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నది. దామరచెర్లలో 4,000 మెగావాట్​ల కెపాసిటీ తో ఏర్పాటు చేసిన ఈ పవర్ ప్లాంట్.. బొగ్గునిల్వలు కేటాయించిన మణుగూరుకు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో బొగ్గు రవాణాకు అధిక ఖర్చవుతోంది. అలాగే ఈ ప్లాంట్ నిర్మాణంలో సివిల్ వర్క్స్ నామినేషన్ పై బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వారికి ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ నరసింహారెడ్డి జ్యుడీషియరీ కమిషన్ పై మూడు అంశాలపై విచారణ చేపట్టింది.