మూడేండ్ల తర్వాత ఆంక్షలు లేకుండా స్వాతంత్ర్య దినోత్సవం 

మూడేండ్ల తర్వాత ఆంక్షలు లేకుండా స్వాతంత్ర్య దినోత్సవం 

జమ్మూ కాశ్మీర్‌లో మూడు సంవత్సరాల తర్వాత స్వాతంత్ర్య దినోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. తొలిసారిగా 
ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలపై ఎటువంటి ఆంక్షలు లేవని అధికారులు ప్రకటించారు. భద్రతా దృష్ట్యా ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం రోజున ఇంటర్నెట్ మరియు మొబైల్ సేవలు నిలిపివేయబడతాయి. కానీ, జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత తొలిసారిగా ఈ సేవలను నిషేధించలేదు. గతంలో మూడు సంవత్సారల కింద 2018లో గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా హయాంలో ఇంటర్ నెట్ సేవలపై నిషేధం విధించలేదు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మొబైల్ సేవలపై ఆంక్షలు పెట్టలేదు. కాశ్మీర్‌లోని సున్నితమైన ప్రదేశాలలో భద్రతా దళాలను పటిష్టంగా మోహరించినప్పటికీ.. శ్రీనగర్ మరియు లోయలోని ఇతర ప్రాంతాలలో ప్రజల కదలికలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని అధికారులు తెలిపారు.

‘ఇండిపెండెన్స్ డే సందర్భంగా జమ్మూ కశ్మీర్ లో ఇంటర్నెట్ షట్‌డౌన్ విధించలేదు’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ ట్వీట్‌ చేశారు.

ఆగష్టు 15, 2005న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాన వేదిక అయిన బక్షి స్టేడియం బయట ఉగ్రవాదులు ఐఈడీని మొబైల్ ఫోన్ సాయంతో పేల్చారు. అందువల్ల స్వాతంత్య్ర మరియు గణతంత్ర దినోత్సవాల సమయంలో నెట్ సేవలపై ఆంక్షలు విధిస్తారు.