కొమరంభీమ్ జిల్లా ఆడ ప్రాజెక్టులో వరద

కొమరంభీమ్ జిల్లా ఆడ ప్రాజెక్టులో వరద

కొమరంభీమ్ జిల్లా: వర్షాల ప్రభావంతో ఆడ ప్రాజెక్టులో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో ఇవాళ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243.000 మీటర్లు కాగా.. ప్రస్తుతం 240.200 మీటర్లు ఉంది. అలాగే నదిలో వరద ప్రవాహం (ఇన్ ఫ్లో) 350 క్యూసెక్కులు ఉండగా.. నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో రెండు గేట్ల ద్వారా 5120 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల (ఔట్ ఫ్లో) చేస్తున్నారు.