- తయారీ కేంద్రం సీజ్.. ల్యాబ్‌కు శాంపిల్స్
కూకట్పల్లి, వెలుగు: కైత్లాపూర్‌లోని ఓ ఆహార తయారీ కేంద్రంపై కూకట్పల్లి ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. యూసుఫ్, రిజ్వాన్ అనే ఇద్దరు వ్యక్తులు నిర్వహిస్తున్న ‘బిరిస్తా ఫ్రైడ్ ఆనియన్’ తయారీ కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో నడుస్తున్నట్లు గుర్తించారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా వాడిన వంట నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఫ్రైడ్ ఉల్లిపాయలను తయారు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా వెయ్యి కిలోల ముడి ఉల్లిపాయలు, 70 కిలోల ఫ్రైడ్ ఉల్లిపాయలు, 480 లీటర్ల వాడిన వంట నూనెను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపి, తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు.

