న్యూఢిల్లీ: కొత్త ఎలక్షన్ కమిషనర్‌గా మాజీ బ్యూరోక్రాట్ అరుణ్ గోయల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గోయల్..1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. నవంబర్ 18న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర మే నెలలో పదవీ విరమణ చేయగా ఎలక్షన్ కమిషన్‌లో ఖాళీ ఏర్ప డింది. ఆ స్థానంలో కేంద్ర ప్రభుత్వం శనివా రం అరుణ్ గోయల్‌ను ఎంపిక చేయగా .. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. గోయల్.. ఇంతకు ముందు భారీ పరిశ్రమ ల సెక్రటరీగా పనిచేశారు. కేంద్ర సాంస్కృతి క మంత్రిత్వ శాఖలోనూ సేవలందించారు. సీఈసీ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేతో కలిసి గోయల్పనిచేయనున్నారు. గుజరాత్లో డిసెంబర్1, 5న రెండు దశలలో ఎన్నికలు జరగడానికి ముందు గోయల్ నియామకం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
