ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటా: వైఎస్ జగన్ 

ఈసారి కార్యకర్తలను బాగా చూసుకుంటా: వైఎస్ జగన్ 

జగన్ 2.0 లో కార్యకర్తలను బాగా చూసుకుంటానని అన్నారు వైసీపీ అధినేత జగన్. ప్రతి సంక్షేమ పథకం కార్యకర్తల ద్వారానే ప్రజలకు అందుతుందని అన్నారు. గురువారం ( జూన్ 18 ) తాడేపల్లిలో పార్టీ ఆఫీసులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ . మరో ఏడాదిన్నరలో పాదయాత్ర ప్రారంభిస్తానని... చంద్రబాబు దుర్మార్గ పాలనకు త్వరలోనే ముగింపు పడుతుందని అన్నారు జగన్. 

రాష్ట్రంలో అన్యాయమైన పాలన చూస్తున్నామని... ప్రశ్నించే వారిపై దొంగకేసులు పెడుతున్నారని... రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రి తలలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. చీకటి కొంతకాలమే ఉంటుందని.. వెలుగురాక తప్పదని అన్నారు జగన్. పార్టీ నాయకులు బాధితులకు అండగా నిలవాలని.. బాధ్యతను విస్మరించొద్దని అన్నారు.పేదవాడికి నాయకులంతా తోడుగా ఉండాలని అన్నారు జగన్.

►ALSO READ | 3 నెలలుగా వెంటాడి వేటాడి సీఐ నాగరాజు కొడుతున్నాడు.. సెల్ఫీ వీడియోలో చెప్పి ఆత్మహత్య

ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యిందని... చంద్రబాబు విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని అన్నారు. జగన్ పాలనతో ప్రజలు పోల్చి చూస్తూ చర్చించుకుంటున్నారని అన్నారు. ఐదేళ్ల పాలనలో ఎప్పుడు లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గర్వంగా చెప్పగలమని అన్నారు జగన్.

మేనిఫెస్టోకు విలువలేని రోజులు చేశామని... ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసేవారని అన్నారు. అలాంటి మేనిఫెస్టోకు విలువను తీసుకొచ్చామని అన్నారు. 99 శాతం హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైసీపీనే అని అన్నారు జగన్. క్యాలెండర్ పెట్టుకొని మరీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని.. పరిపాలనలో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు జగన్.