విజయవాడ: ఏపీ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు.. సాయికృష్ణ అనే యువకుడిని లాకప్ డెత్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితుడు గాదె సాయికృష్ణ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి న్యాయం చేయాలని వేడుకుంది. ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న సమయంలోనే.. కృష్ణలంక సీఐ నాగరాజుపై మరో సంచలన ఆరోపణ బయటికొచ్చింది.
బ్రేకింగ్ న్యూస్
— Rahul (@2024YCP) June 18, 2026
విజయవాడ: కృష్ణలంక సీఐ నాగరాజుపై మరోసారి తీవ్ర ఆరోపణలు
సాయికృష్ణ లాకప్ డెత్ నేపథ్యంలో మరో యువకుడి మృతి కలకలం
కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల వల్లే..క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యుల ఆరోపణ
పీఎస్ కు రమ్మన్న వెంటనే పురుగులమందు తాగిన క్రాంతికుమార్… pic.twitter.com/HoAM4azfXs
విజయవాడ కృష్ణలంకకు చెందిన క్రాంతికుమార్ అనే రౌడీషీటర్ మే 21న ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు సీఐ నాగరాజు కారణం అనే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మూడు నెలలుగా సీఐ నాగరాజు తనను వెంటాడి వేటాడి కొడుతున్నాడని.. సీఐ నాగరాజు దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని.. తన చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు కారణం అంటూ సెల్ఫీ వీడియో తీశాడు క్రాంతికుమార్.
ఆ వీడియోలోనే అతను పొలాల్లో పంటలకు ఉపయోగించే గుళికల మందు తినటం.. ఆ వెంటనే నీళ్లు తాగటం కనిపించింది. తాను మాదిగ కులానికి చెందిన వ్యక్తిని అని.. అందుకే తనను 3 నెలలుగా రోజూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి కొడుతున్నాడని క్రాంతికుమార్ ఈ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు.
విజయవాడకు చెందిన గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ కేసు ఏపీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఒక కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను జూన్ 29వ తేదీలోపు హాజరుపరచాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
గాదె సాయి కృష్ణను పోలీసులు కొట్టి చంపారని.. సాయికృష్ణ డెడ్ బాడీని కృష్ణలంక శ్మశాన వాటికలో కాల్చేశారని.. ఆధారాలు లేకుండా చేశారని.. బూడిద కూడా ఆ కుటుంబానికి ఇవ్వకుండా చేశారని మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సాయికృష్ణ తల్లి కూడా మీడియా ముందుకొచ్చి తన కొడుకును కాల్చేసి ఉంటే బూడిదైనా ఇవ్వాలని కన్నీరుమున్నీరయింది.
