ఫోన్ నంబర్లు అడిగితే ఇచ్చాం.. ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాకేం సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఫోన్ నంబర్లు అడిగితే ఇచ్చాం.. ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మాకేం సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     తిరుపతన్న అడిగితేనే నంబర్లు అందించాం  
  •     సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ అధికారులు అడిగిన ఫోన్ నంబర్లు మాత్రమే ఇచ్చామని, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తమకేం సంబంధం లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఇచ్చారు. తిరుపతన్న అడిగినందుకే ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లు ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ మేరకు గురువారం సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. 

2023 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 నుంచి 30 మధ్య ట్యాప్ అయిన నంబర్లతో వీరిద్దరికీ లింకులు ఉన్నాయి.  ఇందుకు సంబంధించిన ఫోన్ నంబర్లు సహా ఆయా వ్యక్తుల వివరాలను అందించారు. దర్యాప్తులో భాగంగా వీరిద్దరూ గురువారం సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు హాజరయ్యారు. 2024 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 16న వీరిద్దరూ ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను పరిశీలించడంతో పాటు మాజీ అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్పీ తిరుపతన్నతో సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు ప్రశ్నించారు.

ప్రత్యర్థులే టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నకిరేకల్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లా నాయకుల ఫోన్లను చిరుమర్తి లింగయ్య ట్యాప్ చేయించినట్లు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు గుర్తించారు. తన ప్రత్యర్ధులతో పాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బీజేపీ అభ్యర్థుల ఆర్థిక వ్యవహారాలపై ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిఘా పెట్టింది. గతంలో తిరుపతన్న నల్గొండలో విధులు నిర్వహించినప్పుడు చిరుమర్తి లింగయ్య్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తిరుపతన్నతో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించారు. 

ఇందులో భాగంగా చిరుమర్తి లింగయ్య వద్ద తిరుపతన్న పలు నంబర్లను సేకరించాడు. ఇందులో 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 15 నుంచి 30 మధ్య జరిగిన ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇద్దరి ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లను సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేకరించింది. తిరుపతన్న సమక్షంలో ఆయా నంబర్ల గురించి వివరాలు సేకరించింది. కాగా, తిరుపతన్న అడిగినందుకే తన పీఏ రెండు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లను ఇచ్చినట్లు చిరుమర్తి లింగయ్య సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెల్లడించారు. ఆయా నంబర్ల ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వివరించారు.

కుటుంబ పంచాదీలోనూ తలదూర్చి.. 

జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిరుపతన్నది ఒకే సామాజిక వర్గం. ఈ క్రమంలో తమ బంధువుల్లోని రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యావద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తిరుపతన్న పలుమార్లు చర్చలు జరిపారు. ఆయా కుటుంబాలకు చెందిన ఇద్దరి ఫోన్ నంబర్లను తిరుపతన్నకు జైపాల్ యాదవ్ ఇచ్చాడు. ఇలా తిరుపతన్న సేకరించిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లు కూడా ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లభించాయి. వీటి ఆధారంగానే సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారించారు. ఈ మేరకు సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తన స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చినట్టు జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్ వెల్లడించారు. 

తిరుపతన్నకు ఇచ్చిన ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్లకు చెందిన వారికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ రెండు ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్స్ ట్యాపింగ్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తిరుపతన్న, జైపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేటా ఆధారంగా సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులు స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు చేశారు.