కోలుకుంటున్నన్యూజిలాండ్ మాజీ  క్రికెటర్‌ 

కోలుకుంటున్నన్యూజిలాండ్ మాజీ  క్రికెటర్‌ 

న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్(51) ఆరోటిక్ డిసెక్షన్ తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన సిడ్నీలోని సెయింట్ విన్సెంట్  ఆస్పత్రిలో  ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. కెయిన్స్ కు వెంటిలేటర్ ను తొలగించామని చెప్పారు. 

అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించారు. తన 17 ఏళ్ల కెరీర్లో 62 టెస్టులు, 215 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 3,320 పరుగులు చేయడంతో పాటు 218 వికెట్లు తీశారు. వన్డేల్లో 4,950 రన్స్ చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టారు.