మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల .. పెట్టుబడులు రూ.54 లక్షల కోట్లు

మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల .. పెట్టుబడులు రూ.54 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ఇండియన్ కంపెనీల్లో ఫారిన్ పోర్టుఫోలియో  ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐ) పెట్టుబడులు విలువ ఏకంగా 651 బిలియన్ డాలర్ల (రూ.54 లక్షల కోట్ల) కు పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో ముగిసిన రెండో క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి  15 శాతం (ఇయర్ ఆన్ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వృద్ధి చెందింది.  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరుగుతుండడంతో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ కొనసాగుతున్నాయి. మార్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ రిపోర్ట్ ప్రకారం, ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ విలువ గత ఏడాది కాలంలో  566 బిలియన్ డాలర్ల నుంచి 651 బిలియన్ డాలర్లకు పెరిగింది. 

ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీటి విలువ 626 బిలియన్ డాలర్లుగా ఉంది.  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ పెరిగినా మొత్తం మార్కెట్ క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరి వాటా  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 16.95 శాతానికి తగ్గింది.  ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు నికరంగా 5.38 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మాక్రో ఎకానమీ బాగుండడంతో ఈ ఏడాది జులైలో నికరంగా 5.68 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐలు, ఆగస్టులో  కేవలం 1.48 బిలియన్ డాలర్లే ఇన్వెస్ట్ చేశారు. 

క్రూడాయిల్ ధరలు పెరగడం, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ భయాలు ఎక్కువవ్వడంతో ఆగస్టులో ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఐల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లోస్ తగ్గాయి. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం నికరంగా 1.78 బిలియన్ డాలర్లు విలువైన షేర్లను అమ్మేశారు. ఆరు నెలల్లో మొదటిసారిగా నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్లర్లుగా మారారు.

ALSO READ: ఇస్త్రీ కొట్టిన అందెల