ముషీరాబాద్, వెలుగు: ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిళ్లలో గ్రూప్–2 అభ్యర్థులకు ఉచితంగా గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ బి.సంఘమిత్ర తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం మొత్తం ఎనిమిది గ్రాండ్ టెస్టులు ప్లాన్చేశామని చెప్పారు. హిమాయత్ నగర్, అశోక్ నగర్, దోమలగూడలోని బ్రాంచుల్లో మొదటి టెస్టు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. వివరాల కోసం 93468 82593, 95734 62587లో సంప్రదించాలని సూచించారు.
