మెడికల్ క్యాంప్ ద్వారా ఫ్రీగా మెడి సిన్స్

మెడికల్ క్యాంప్ ద్వారా ఫ్రీగా మెడి సిన్స్

హైదరాబాద్,  వెలుగు: టీ గోల్ఫ్ ఫౌండేషన్, శ్రీనివాస చారిటబుల్ ఫౌండర్ డాక్టర్ ఎన్ఆర్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్ ఆవరణలో శుక్రవారం ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఓమ్ని హాస్పిటల్స్, సాయి జ్యోతి కంటి ఆస్పత్రికి చెందిన డాక్టర్లు బౌల్డర్ హిల్స్ కార్మికులు 120 మందికి ఆర్థో, గైనిక్, కంటికి సంబంధించిన టెస్టులు చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి, శశికుమార్, డాక్టర్లు వికాస్, శ్రవణ్, రాధిక, ఐశ్వర్య పాల్గొన్నారు.