గుడ్ న్యూస్: సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో ఫ్రీ పార్కింగ్: 20 రూపాయల ఫీజు రద్దు చేసిన హైకోర్టు

గుడ్ న్యూస్: సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో ఫ్రీ పార్కింగ్: 20 రూపాయల ఫీజు రద్దు చేసిన హైకోర్టు

హైదరాబాద్: సినీ ప్రియులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజును రద్దు చేసింది. ఈ మేరకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 121ను హైకోర్టు సస్పెండ్ చేసింది. మల్టీప్లెక్స్‎ల మాదిరిగానే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ప్రేక్షకులకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఆదేశించింది. దీంతో ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు రూ.20 పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

సాధారణంగా మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు కస్టమర్లకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. కానీ 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరాయి. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యానికి పార్కింగ్ ఫీజు వసూల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ ఈ మేరకు 121ను జారీ చేసింది.

 ఈ క్రమంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లో రూ.20 పార్కింగ్ ఫీజు వసూల్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఓ యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సింగిల్ స్క్రీన్ థియేటర్‎లలో పార్కింగ్ ఫీజును ఎత్తేసింది.  2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పార్కింగ్ ఫీజు వసూల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 12ను హైకోర్టు కొట్టివేసింది.