అంబులెన్స్‌‌‌‌లకు పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఫ్రీ

అంబులెన్స్‌‌‌‌లకు పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఫ్రీ
  • అంబులెన్స్‌‌‌‌లకు రిలయన్స్‌‌ బంకుల్లో పెట్రోల్‌‌, డీజిల్‌‌ ఫ్రీ
  • తెలుగు రాష్ట్రాలకు కరోనా సాయాన్ని ప్రకటించిన కంపెనీ

హైదరాబాద్, వెలుగు: కరోనాను కట్టడి చేయడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్  తన వంతు మద్దతును ప్రకటించింది. ఇందులో భాగంగా కరోనా సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే ఎమెర్జెన్సీ వెహికల్స్‌‌‌‌, అంబులెన్స్‌‌లకు  ఫ్రీగా పెట్రోల్‌‌, డీజిల్‌‌లను అందించనుంది.  డైలీ ఒక వెహికల్‌‌కు  గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఫ్రీగా అందిస్తాయి. జూన్ 30 వరకు ఈ ఫెసిలిటీని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మరోవైపు ఆక్సిజన్ సమస్యలను తీర్చడంలో భాగంగా  తెలంగాణకు 80 టన్నులు,  ఆంధ్రప్రదేశ్ కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను  రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం చేర్చింది. దేశ వ్యాప్తంగా 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌‌ను రిలయన్స్‌‌ సమకూరుస్తోంది.