దేశాభివృద్ధిలో మహిళల పాత్ర భేష్ : ద్రౌపది ముర్ము

దేశాభివృద్ధిలో  మహిళల పాత్ర భేష్  : ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ : మహిళలు అన్ని రంగాల్లో  ఉన్నత శిఖరాలు అధిరో హిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మిసైళ్లు తయారు చేయడం నుంచి మ్యూజిక్ దాకా మహిళల సేవలు అద్భుతమని కొనియాడారు. దేశాభివృద్ధి లోనూ వారి  కృషిని అభినందించారు. ఢిల్లీలోని మానేక్షా సెంటర్​లో ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్​లో ‘నారీ శక్తి’ అంశంపై ఆమె మాట్లాడారు. ఓ సైనికుడి భార్యతో పాటు జార్ఖండ్ నుంచి వచ్చిన ఓ టీచర్  తమ జీవితం లో ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు, అవమానాలు, అసమానతల గురించి మాట్లాడారు. సవాళ్లంటినీ దాటుకుని ఎలా ముందుకెళ్లారో ప్రోగ్రామ్​లో వివరించారు. అంతకుముందు అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను ద్రౌపది ముర్ము పరిశీలించారు.