ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న.. ఇంధన పొదుపు చర్యలు ఇవే

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న.. ఇంధన పొదుపు చర్యలు ఇవే

అమెరికా , ఇరాన్ యుద్దం కారణంగా నెలకొన్న చమురు సంక్షోభం నుంచి బయటపడేందుకు  పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి అడుగుగా ప్రభుత్వ ఉద్యోగులకు  వర్క్ ఫ్రం హోం ప్రకటించిన  ఢిల్లీ ప్రభుత్వం.. ప్రభుత్వ వాహనాలు వినియోగంపై ఆంక్షలు, వివిధ శాఖల్లో ఆఫీసుల పనివేళల్లో మార్పులు  చేయడం వంటి పొదుపు చర్యలను చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు వారానికి ఒకసారి ప్రతి సోమవారం మెట్ర సోమవారంగా పాటించాలని ఆదేశించింది. ఆరు నెలల వరకు ప్రభుత్వం కొత్త వాహనాలను కొనుగోలు చేయదని ప్రకటించింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు  ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా  ప్రతి సోమవారం వాహన రహిత దినంగా పాటించాలని సూచించింది.

ఇంధన, శక్తి పొదుపు చర్యలు ఇవే .. 

  •  ప్రభుత్వ ఉద్యోగులు  ప్రతి వారం రెండు రోజుల పాటు ఇంటి నుంచి పనిని చేయాలి 
  • ప్రైవేట్ కంపెనీలకు కూడా ఇంటి నుండి పని చేసే ఏర్పాట్లను ప్రోత్సహిస్తూ అడ్వైజరీ జారీ చేసింది. 
  • ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని తగ్గించారు.  
  • రాబోయే ఆరు నెలల పాటు కొత్త వాహనాలను కొనుగోలు చేయదు.
  • అధికారుల వాహననాలకు  20 శాతం పెట్రోల్ కట్.
  • ప్రతి సోమవారం మంత్రులు, అధికారులు మెట్రోల్లో ప్రయాణించాలి..“మెట్రో సోమవారం”గా  పాటించాలి 
  • ట్రాఫిక్ జామ్‌ను తగ్గించేందుకు ఆఫీసు టైమింగ్ లో మార్పులు చేశారు 
  • ఢిల్లీ ప్రభుత్వ ఆఫీసు టైమింగ్స్  ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 
  • MCD ఆఫీసు టైమింగ్స్ ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 
  • ప్రతి వారం ఒకరోజు  వాహన రహిత దినం పాటించాలి 
  • ఉద్యోగుల రవాణా అలవెన్స్ లు  10 శాతం పెంచనున్నారు.
  • సరుకుల రవాణాకు ట్రక్కులకు నో పర్మిషన్.. రైళ్లను వినియోగించాలని వ్యాపారులకు ఆర్డర్ 

►ALSO READ | వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం: లాక్ డౌన్ కు మొదటి అడుగు పడిందా..!