ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆయిల్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. వారంలో 2 రోజులు ఇళ్ల నుంచే పని చేయాలని.. ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం. దీని వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుందని.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గి.. పెట్రోల్, డీజిల్ కొరత నుంచి గట్టెక్కవచ్చని స్పష్టం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ ప్రభుత్వం గురువారం (మే 14) కీలకం నిర్ణయ తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేసింది. వారానికి రెండు రోజులు ఇంటినుంచే పనిచేయాలని ఆదేశించింది. త్వరలో ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వారంలో 2 రోజులు వర్క్ ఫ్రం హోం ఉందని.. రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం మార్గదర్శకాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా.
లాక్ డౌన్ కు మొదటి అడుగు పడిందా..?
కరోనా తరహా లాక్ డౌన్ పరిస్థితులు రాబోతున్నాయంటూ ప్రధాని మోదీ బహిరంగ సభల్లో చెబుతూ వస్తున్నారు. అలాంటి పరిస్థితులకు ఢిల్లీ ప్రభుత్వం మొదటగా తీసుకున్న నిర్ణయం ఇది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లాక్ డౌన్ కు మొదటి అడుగు పడిందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తున్నారు.
►ALSO READ | బియ్యం కొరత రాబోతుందా.. అన్నం రిచ్ ఫుడ్ కాబోతుందా.. వరి ఉత్పత్తి 15% తగ్గనున్నట్లు అమెరికా నివేదిక..!
దేశంలో ఆయిల్ సంక్షోభం లేదని.. ఇంధన కొరత లేదని.. 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ పదే పదే చెబుతుంది. అందుకు భిన్నంగా.. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. లాక్ డౌన్ కు మొదటి అడుగు పడింది అనే ప్రచారం ఊపందుకుంది.
