ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి : కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి

ఉద్యోగాలు ఇచ్చే  స్థాయికి ఎదగాలి : కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి
  •     యువతకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పిలుపు

న్యూఢిల్లీ, వెలుగు: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు కల్పిం చే స్థాయికి ఎదగాలని కేంద్ర ఆర్థిక శాఖ సహా య మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. స్వశక్తితో ఎదగాలని, ఓబీసీలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. ప్రపంచాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచు కోవాలని, ‘మేము సాధించగలం’ అనే నమ్మకం ప్రతి యువకుడిలో ఉండాలన్నారు. 

కాపు సామాజిక వర్గం ఐక్యత, యువత సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సమాఖ్య–2026’ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పంకజ్ చౌదరి ఆవిష్కరించారు. 4 రాష్ట్రాలకు చెందిన కాపు ప్రతినిధులు, ఎంపీలు, వివిధ పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీలు కె. లక్ష్మణ్, సానా సతీశ్, వద్ది రాజు రవిచంద్ర, బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, పల్లం రాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తీన్మార్ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.