ఏ ఇబ్బందీ లేకుండా ‘కేబీఆర్’ వన్ వే... పాదచారులు, వాకర్స్, అంబులెన్స్‌‌‌‌ ల కోసం పక్కా ప్లాన్

ఏ ఇబ్బందీ లేకుండా ‘కేబీఆర్’ వన్ వే... పాదచారులు, వాకర్స్, అంబులెన్స్‌‌‌‌ ల కోసం పక్కా ప్లాన్
  • మొదటి 10 రోజులు నాలుగు షిఫ్టుల్లో పోలీసుల డ్యూటీ  
  • సిటీ ట్రాఫిక్​ బాస్​ జోయల్​ డేవిస్​
  • కేబీఆర్​ పరిసర ప్రాంతాల పరిశీలన

హైదరాబాద్​సిటీ, వెలుగు : హెచ్-సిటీ  ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ వన్-వే ట్రాఫిక్ విధానం అమలు నేపథ్యంలో బుధవారం ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీ కాజల్ సింగ్, ఇతర ఉన్నతాధికారులు కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్, మాట్లాడుతూ పనుల ఏడాదిన్నర పాటు కొనసాగే అవకాశం ఉన్నందున డ్రోన్ విజువల్స్, ట్రాఫిక్ డేటా, ఆర్కాడిస్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఇంజినీర్ల అధ్యయనం ఆధారంగా కేబీఆర్ చుట్టూ 'వన్-వే' అమలు చేస్తున్నామన్నారు. ఆగస్టు 18 ఉదయం ఆరు గంటల నుంచి ఈ విధానం మొదలవుతుందని చెప్తూ కీలక డైవర్షన్స్​గురించి వివరించారు. 

  • ఎన్​ఎఫ్​సీఎల్​నుంచి రోడ్​నంబర్​45 మీదుగా ఐటీ కారిడార్​కు వెళ్లాలనుకునేవారికి ఎన్టీఆర్ భవన్ వద్ద రైట్ టర్న్ ఉండదని, ఎడమవైపు తిరిగి, కేబీఆర్ పార్కు వైపు వెళ్లి ఎడమ లేదా కుడి లేన్ల ద్వారా ప్రయాణించి రోడ్ నంబర్​45 వైపు లేదా జర్నలిస్ట్ కాలనీ మీదుగా ఐటీ కారిడార్ వైపు వెళ్లవచ్చు.  
  • చెక్‌‌‌‌పోస్ట్ నుంచి పంజాగుట్ట ఎన్​ఎఫ్​సీఎల్​ మీదుగా బేగంపేట వెళ్లాలనుకునే వారు చెక్‌‌‌‌పోస్ట్ నుంచి రెండు లైన్లలో ప్రయాణించవచ్చన్నారు. ఎన్ఎఫ్​సీఎల్​వైపు వెళ్లేవారు జింఖానా క్లబ్ సమీపంలో (100 మీటర్ల వద్ద) తెరిచిన మీడియన్ ద్వారా లైన్​-1 (ఎడమ లేన్) లోకి మారి, ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ-లెఫ్ట్ తీసుకుని వెళ్లవచ్చు. 
  • కేబీఆర్ చెక్‌‌‌‌పోస్ట్ నుంచి రోడ్​నంబర్​10/12/క్యాన్సర్ దవాఖానకు వెళ్లాలనుకుంటే స్టడీ సర్కిల్ వద్ద ఉన్న మీడియన్ ఓపెనింగ్ ద్వారా ఎడమవైపునకు మారి రోడ్ నంబర్​10కి వెళ్లవచ్చు, రోడ్ నంబర్​12 వెళ్లేవారు క్యాన్సర్ దవాఖాన దాటిన తర్వాత ఎడమవైపునకు వెళ్లొచ్చు. 
  • చెక్‌‌‌‌పోస్ట్ నుంచి క్యాన్సర్​హాస్పిటల్​కు వెళ్లాలనుకునేవారు స్టడీ సర్కిల్ వద్ద ఉన్న మీడియన్ ఓపెనింగ్ ద్వారా ఎడమవైపునకు మారి రోడ్ నెం.10కి వెళ్లవచ్చు; రోడ్ నెం. 12 వెళ్లేవారు క్యాన్సర్ ఆసుపత్రి దాటిన తర్వాత ఎడమవైపునకు వెళ్లవచ్చు.
  • ఎన్ఎఫ్​సీఎల్​నుంచి రోడ్ నంబర్​36 వెళ్లేవారు ఎన్టీఆర్ భవన్ వద్ద రైట్ టర్న్ లేకపోవడంతో శ్రీనగర్ కాలనీ టీ -జంక్షన్ నుంచి కుడివైపునకు తిరిగి ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి క్రాస్ రోడ్స్, రోడ్ నంబర్​10 జూబ్లీహిల్స్ (డైమండ్ హౌస్), ఆల్కజార్ ప్లాజా వద్ద కుడివైపునకు తీసుకోవాలి.
  • ఫిలింనగర్ వెళ్లేవారు సాయంత్రం రోడ్ నంబర్​45 వద్ద రైట్ టర్న్ ఉండదు కాబట్టి, రోడ్ నంబర్​51, 52 మార్గాలను వాడుకోవచ్చు. 

పాదచారుల కోసం 

వన్-వే వల్ల వాహనాలు ఆగకుండా ప్రయాణిస్తుండటంతో పాదచారులు రోడ్డు దాటేందుకు ఇబ్బంది కలగకుండా సిగ్నల్ పోల్స్ ఏర్పాటు చేశారు. జంక్షన్లలో పాదచారులు దాటడానికి అనువుగా 15 సెకన్ల పాటు సిగ్నల్ ఆపేలా వ్యవస్థను రూపొందించారు.

వాకర్స్​ కోసం..

కేబీఆర్​పార్క్​కు రోజూ 2500 మంది వరకు వాకర్స్ వస్తుంటారు కాబట్టి రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకూడదు. కేబీఆర్ పార్కింగ్ ప్లేసుల్లో చుట్టుపక్కల ఉండే వాణిజ్య సంస్థల వాహనాలు ఆక్రమించకుండా చర్యలు తీసుకుంటారు. వాకర్స్ ఎక్కువగా ఉండే ఉదయం 5 నుంచి 7 గంటల మధ్య ఒక లైన్​లో పార్కింగ్‌‌‌‌కు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. 

అంబులెన్స్‌‌‌‌లు,  ఎమర్జెన్సీ కోసం 

సిగ్నల్స్ నిలిచిపోకుండా నిరంతర ఫ్లో ఉండటం వల్ల అపోలో, ఒమేగా తదితర దవాఖానలకు వెళ్లే అంబులెన్స్‌‌‌‌లు స్పీడ్​గా వెళ్లే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేక లైన్​ఏర్పాటు చేస్తారు.  

నాలుగు షిఫ్టుల్లో పోలీసులు  

సాధారణంగా ఉండే 2 షిఫ్టుల విధానానికి బదులుగా, ప్రజలకు కొత్త రూట్లపై అవగాహన వచ్చే వరకు వారం నుంచి 10 రోజుల పాటు నాలుగు షిఫ్టుల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. వీరు 24 గంటల పాటు డ్యూటీ చేస్తారు 

నేడు సీఎం పర్యటనతో ట్రాఫిక్​ ఆంక్షలు 

బంజారాహిల్స్ రోడ్ నంబర్​10లోని కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్‌‌‌‌కు సీఎం రేవంత్​రెడ్డి వస్తున్న సందర్భంగా గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని ట్రాఫిక్​జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ రోటరీ, జహీరా నగర్, బంజారాహిల్స్ రోడ్​నంబర్​10లో రద్దీ ఎక్కువగా ఉండొచ్చన్నారు. 

మసాబ్​ట్యాంక్​ టు జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్​

మసాబ్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లే వారు మసాబ్ ట్యాంక్  నుంచి రోడ్ నంబర్​12  మీదుగా  అగ్రసేన్ ఐలాండ్, ఎన్టీఆర్ భవన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చన్నారు. అలాగే, మరో రూట్​లో మసాబ్ ట్యాంక్, రోడ్​నంబర్​7,  రోడ్ నంబర్​14 మీదుగా  ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కు వెళ్లొచ్చన్నారు. 

జూబ్లీహిల్స్​ చెక్​పోస్ట్ టు మసాబ్​ట్యాంక్ 

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మసాబ్​ట్యాంక్​వెళ్లాలనుకుంటే రెండు రూట్లు సూచించారు. రూట్​నంబర్​వన్​లో భాగంగా ఎన్టీఆర్ భవన్ నుంచి రోడ్ నంబర్​14 మీదుగా రోడ్ నంబర్​7 నుంచి ఖైరతాబాద్ ఆ తర్వాత మసాబ్ ట్యాంక్ వెళ్లొచ్చు. అలాగే, చెక్​పోస్ట్​, ఎన్టీఆర్ భవన్ నుంచి అగ్రసేన్ ఐలాండ్ , రోడ్​నంబర్​12  మీదుగా మసాబ్ ట్యాంక్ చేరుకోవచ్చు.