పూలే దంపతుల విగ్రహావిష్కరణను సక్సెస్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

పూలే దంపతుల విగ్రహావిష్కరణను సక్సెస్ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఈనెల14న సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఐమాక్స్ సమీపంలో విగ్రహాలను ఏర్పాటు చేయగా, అనంతరం హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. 

బుధవారం మసాబ్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌లోని డీఎస్ఎస్ భవన్‌‌‌‌‌‌‌‌లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కుల సంఘాల నేతలతో మంత్రి సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపట్టాలని కోరారు.