నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 2 క్వింటాళ్ల విత్తనాలు సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 2 క్వింటాళ్ల విత్తనాలు సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్న ఇద్దరిని ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన 2 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ నీలం రవి వివరాల ప్రకారం.. నకిలీ పత్తి విత్తనాల రవాణాపై సమాచారం అందడంతో మంగళవారం రాత్రి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో ఓ కారును తనిఖీ చేయగా నాలుగు పాలిథిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాగుల్లో నకిలీ విత్తనాలను గుర్తించారు. కారులో ఉన్న భీమిని మండలం పెద్దపేటకు చెందిన షేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మర్రిగడ్డకు చెందిన అరే వెంకటగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించినట్లు సీఐ తెలిపారు.